దసరా వేళ అప్రమత్తంగా ఉండండి.. ఎస్పీ

సూర్యాపేట జిల్లా ప్రజలు దసరా పండుగను ప్రశాంతంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎస్పీ కె. నరసింహ సూచించారు. పండుగ వేళ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. మహిళలను గౌరవిస్తూ, ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా వ్యవహరించాలని, బెట్టింగ్లు, జూదం, గొడవలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రయాణాల్లో రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.

