కాఫీలో మత్తుమందు కలిపి.. భర్త ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి

తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక మహిళ దారుణం చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో జరిగింది. నదీమ్, షబ్నమ్ భార్యాభర్తలు. వీరికి పిల్లలు లేరు. తన భర్తకు వేరే మహిళతో సంబంధం ఉందనే అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాత్రి షబ్నమ్ భర్తకు కాఫీ ఇచ్చింది. అది తాగిన కాసేపటికే భర్త స్పృహ కోల్పోగా, ఆమె కత్తితో అతడి ప్రైవేట్ పార్ట్‌పై తీవ్రంగా దాడి చేసింది. తర్వాత అక్కడి నుంచి పరారైంది.



