జార్ఖండ్ ముఖ్యమంత్రి తల్లి మృతి

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తల్లి, మాజీ సీఎం శిబు సోరెన్ భార్య రూపీ సోరెన్(80) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె రాంచీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో శిబు సోరెన్‌కి తోడుగా నిలిచి, సోరెన్ కుటుంబానికి మార్గదర్శకురాలిగా రూపీ సోరెన్ కీలక పాత్ర పోషించారు. ఆమె మృతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

