సిక్కింలో విరిగిపడ్డ కొండచెరియలు
సిక్కింలోని రింబి గ్రామంలో భారీ వర్షాల వల్ల కొండచెరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి మట్టి, రాళ్లు, చెత్త భారీగా కిందికి దూసుకొచ్చాయి. దీంతో ఇళ్లు, ఆస్తులు, రోడ్లకు ప్రమాదం పొంచి ఉంది. జిల్లా అధికారులు విడుదల చేసిన వీడియోలో ల్యాండ్‌స్లైడ్ దృశ్యాలు కనిపించాయి. ఇప్పటికే రింబిలో ల్యాండ్‌స్లైడ్ ప్రమాదం కారణంగా 28 ఇళ్లకు చెందిన 128 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు పరిస్థితిని గమనిస్తూ, ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.



