← Back to news

భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త మలుపు..?

By Nani· 10 Aug 2026
భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త మలుపు..?

కొంతకాలంగా టెన్షన్‌లో ఉన్న భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు మళ్లీ సెట్ అవుతాయా? బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహ్మాన్ సోమవారం భారత హైకమిషనర్ దినేశ్ త్రివేదితో సమావేశమయ్యారు. రెండు దేశాల సంబంధాలను మెరుగుపరచడానికి అనుకూల వాతావరణం అవసరమని ఆయన చెప్పారు. అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఉండటం, ఆమెను తిరిగి అప్పగించాలన్న బంగ్లాదేశ్ డిమాండ్ ఇంకా కీలక అంశంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు ఏ దిశగా వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

More in World