తాళం వేసిన ఐదు ఇళ్లలో దొంగతనం

TG : నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలేగాం గ్రామంలో దొంగలు పడ్డారు. తాళం వేసి ఉన్న ఐదు ఇళ్లలో బంగారం, వెండి, క్యాష్‌తో పాటు ఓ బైక్‌ను ఎత్తుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న CC కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని ఎంక్వైరీ మొదలుపెట్టారు. CCTV ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం వెతుకుతున్నారు.

