సొరంగంలో 9 రోజులు.. చివరికి సేఫ్!

తొమ్మిది రోజులుగా చీకటి సొరంగంలోనే ఉండిపోయారు.. బతికే ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి! నేపాల్‌లోని త్రిశూలి-3A జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను ఎట్టకేలకు రెస్క్యూ టీమ్ సజీవంగా బయటకు తీసింది. వరదలు, మట్టి, రాళ్ల కారణంగా వారిని చేరుకోవడం చాలా కష్టమైంది. దాదాపు 170 మీటర్ల లోతులో ఉన్న వాళ్ల కోసం రోజుల తరబడి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. చివరికి ఇద్దరినీ బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. తొమ్మిది రోజుల తర్వాత వాళ్లు ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు అందరికీ ఊరటనిస్తోంది.



