← Back to news

అంబేద్కర్ విగ్రహ పునర్నిర్మాణానికి కమిటీ ఏర్పాటు

By VEMANNA JAY· 58m ago· Jogulamba Gadwal
అంబేద్కర్ విగ్రహ పునర్నిర్మాణానికి కమిటీ ఏర్పాటు

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన డా. B.R అంబేద్కర్ విగ్రహాన్ని పునర్నిర్మించాలని అఖిలపక్ష కమిటీ నిర్ణయించింది. టీఆర్ఎస్ నాయకుడు చింతరేవుల ముని ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో MP మల్లు రవి, MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరిత తిరుపతయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి సహకారంతో కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. వివిధ ప్రజా, కుల సంఘాలు పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

More in Local