‘అమరజీవి జలధార’ పనులకు శ్రీకారం

AP: కడప జిల్లా ప్రొద్దుటూరులో ‘జల్ జీవన్ మిషన్ 2.0–అమరజీవి జలధార’ పనులను CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ ప్రారంబించారు. రాష్ట్రవ్యాప్తంగా 30,156 కోట్లతో పనులు చేపట్టనున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో 27 కోట్ల 36 లక్షల కొత్త నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో 24,601 గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 3 కోట్ల 27 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు. ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉందని తెలిపారు.


