ఫోన్ లేదా gadget నీళ్లలో తడిస్తే ఏం చేయాలి?

ఫోన్, ల్యాప్‌టాప్ నీటిలో తడిస్తే కంగారు పడకుండా వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది. బటన్లు నొక్కడం లేదా ఆన్ చేయడానికి ప్రయత్నించకూడదు. బ్యాక్ కవర్, సిమ్, మెమరీ కార్డ్, కేబుల్స్ తొలగించి, పొడి గుడ్డతో తుడవాలి. ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ లేదా ఎండలో పెట్టకూడదు. సిలికా జెల్ ప్యాకెట్లు ఉన్న జిప్‌లాక్ లేదా బియ్యం డబ్బాలో 24 నుండి 48 గంటలు ఉంచాలి. పూర్తిగా ఆరిపోయాకే ఆన్ చేయాలి, తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టకూడదు. పనిచేయకపోతే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.



