భారీ వర్షాలు.. సుబ్లేడు వద్ద రహదారిపై వరద

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు పెట్రోల్ బంక్ వద్ద కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి వరద నీరు రహదారిపైకి చేరింది. దీంతో శుక్రవారం వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో అత్యవసర పనులపై వెళ్లే స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.



