ఖజాగూడ జంక్షన్లో 60 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు

హైదరాబాద్ ఖజాగూడ జంక్షన్ వద్ద పైపైన్ పనుల కారణంగా ఈనెల 26 నుంచి 60 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కిమ్స్ ఆసుపత్రి, బయోడైవర్సిటీ నుంచి నానక్రమ్ూడ వైపు వెళ్లే మార్గాలపై ప్రభావం పడనుంది. షేక్పేట్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చేవారు టింబర్క్ కాలనీ మీదుగా, ఖజాగూడ లేక్ రోడ్డు మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.



