← Back to news

213 కి.మీ. 2.5 గంటలు.. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం

By aravinda nyayapati· 14 Apr 2026· Telugu Report· Hyderabad
213 కి.మీ. 2.5 గంటలు.. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం

ఢిల్లీలోని అక్షరధామ్ నుంచి ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ వరకు నిర్మించిన ఎక్స్ ప్రెస్ వేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ కి రోడ్డు మార్గంలో ఇప్పుడు 6 గంటల సమయం పడితే ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా దాదాపుగా 3 గంటల్లో వెళ్లిపోవచ్చు. వందే భారత్ వంటి వేగవంతమైన రైళ్లు కూడా ఢిల్లీ, డెహ్రాడూన్ మధ్య సుమారు 5 గంటల సమయం తీసుకుంటున్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఆసియాలోనే అతిపెద్దదైన 12 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వైల్డ్‌లైఫ్ కారిడార్‌ను నిర్మించడం విశేషం. ఇది రాజాజీ నేషనల్ పార్క్ గుండా వెళ్లే జంతువులకు రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు ఉత్తరాఖండ్ పర్యాటక రంగానికి ఊతమిస్తుంది.

More in World