ఆ కులపోళ్ల గణేషుడికి నో ఎంట్రీ... రాజాంలో ఉద్రిక్తత
కులం.. గణేషుడిని కూడా వదల్లేదు. మాల కులం వాళ్లు పెట్టిన గణేషుడు తమ వాడలోకి అడుగుపెట్టేందుకు వీల్లేదని కాపు కులస్తులు భీష్మించుకున్నారు. బారికేడ్లు పెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన విజయనగరం జిల్లా రాజాం మండలంలోని సారధి గ్రామంలో జరిగింది. గ్రామంలోని మాల కాలనీ యువకుల గణేషుడి ఊరేగింపును కాపు వీధిలోకి రానివ్వలేదు. బారికేడ్లు, తాళ్లను అడ్డంపెట్టారు. దీంతో రాజాం పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కుల వివక్ష చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.


