గంగాసాగర్‌లో కుల వివక్ష దాడి: ఇద్దరు SC యువకులకు గాయాలు

వికారాబాద్ జిల్లా యాలాల మండలం గంగాసాగర్ గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో కుల వివక్షతో కూడిన దాడి జరిగింది. ఈ ఘటనలో ఆనంద్ మాదిగ చేతికి కత్తితో తీవ్ర గాయమై నరాలు తెగాయని, మదయ శివకుమార్‌కు గాయాలయ్యాయని బాధితులు తెలిపారు. డీజేకు చందాలు ఇవ్వకుండా దళిత యువకులు నృత్యం చేయడంపై వివాదం తలెత్తిందని, కులం పేరుతో దూషించి దాడి చేశారని పేర్కొన్నారు. బాధితులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. KVPS, CITU, పీహెచ్‌పీఎస్ నాయకులు పరామర్శించారు.బాధ్యులపై SC ST act కింద కేసు నమోదు చేయాలన్నారు.



