రైతుల హక్కులకు పూర్తి రక్షణ: మంత్రి పొంగులేటి

TG: భూముల రీసర్వే తర్వాత అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్‌బుక్కులు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జగిత్యాలలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నకిలీ పాస్‌బుక్కులను గుర్తించి రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ పాస్‌బుక్కుల ఆధారంగా అనర్హులు రైతుబంధు ప్రయోజనాలు పొందారని ఆరోపించారు. భూ రీసర్వే పూర్తయిన తర్వాత నిజమైన రైతుల హక్కులను కాపాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు.



