లాల్ దర్వాజాలో వైభవంగా బోనాలు..

TG : హైదరాబాద్‌లోని లాల్ దర్వాజా సింహవాహినీ మహంకాళి బోనాల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. ఉదయం నుంచే సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మేయర్ విజయలక్ష్మి, సీపీ సజ్జనార్ వచ్చారు. ఒకవైపు భక్తులు క్యూ లైన్లలో రద్దీగా ఉండగా, ఇంకోవైపు పోతురాజుల డాన్సులు ఆకట్టుకున్నాయి.



