ISRO రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్..!

రాత్రి ఆకాశం వైపు అందరి చూపు.. ISRO రేపు GSLV-F17 రాకెట్‌తో EOS-05 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం జరగనుంది. ప్రత్యేకత ఏంటంటే ఇది జియోసింక్రోనస్ కక్ష్యలో సుమారు 36,000 కి.మీ ఎత్తులో ఉండి, ఒకే ప్రాంతాన్ని నిరంతరం గమనించగలదు. రెండు మల్టీస్పెక్ట్రల్ ఇమేజర్లతో సరిహద్దులు, ప్రకృతి విపత్తులు, పర్యావరణ మార్పులు, వ్యవసాయ పరిస్థితులను గమనించడంలో ఉపయోగపడనుంది. ఇది దేశ భద్రతతో పాటు విపత్తులపై వేగంగా స్పందించేందుకు కీలకం.



