చిన్న అవమానం.. ఏళ్ల తరబడి గుర్తుంటుందా?

పిల్లలు చేసిన తప్పు కంటే, ఆ సమయంలో ఇతరులు ఎలా స్పందించారనేదే ఎక్కువకాలం గుర్తుంటుందని సైకాలజీ పరిశోధనలు చెబుతున్నాయి. క్లాస్‌లో తప్పు సమాధానం చెప్పినప్పుడు అందరూ నవ్వితే పిల్లలు బాధపడవచ్చు. ఆ ఘటనను పదే పదే గుర్తుచేసుకుంటూ ఆత్మవిశ్వాసం కోల్పోవచ్చు. అందుకే పేరెంట్స్ పిల్లలు చెప్పేది ఓపికగా వినాలి. అందరి ముందు ఎగతాళి చేయకూడదు. తప్పులు సహజమని, వాటివల్ల పిల్లల విలువ తగ్గదని చెప్పాలి. స్కూల్‌కు వెళ్లడానికి భయపడితే కారణం తెలుసుకుని ధైర్యం చెప్పాలి.



