ఐదేళ్లకే ప్రైమరీ స్కూల్.. పిల్లలకు నిజంగా ఏం నేర్పించాలి?

UNESCO 2026 రిపోర్ట్ ప్రకారం, ఇండియాలో ఐదేళ్ల పిల్లల్లో 51 శాతం మంది ప్రీ-ప్రైమరీ విద్యకు బదులుగా నేరుగా ప్రాథమిక పాఠశాలల్లో చేరుతున్నారు. చిన్న వయసులోనే చదవడం, రాయడం నేర్పించడంపై పేరెంట్స్ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అయితే పిల్లలు ఇతరులతో కలవడం, తమ అవసరాలు చెప్పడం, తప్పుల నుంచి నేర్చుకోవడం వంటి స్కిల్స్ కూడా ముఖ్యమేనని, స్కూల్‌లో చేరే ముందు పిల్లలకు తగిన బేసిక్ స్కిల్స్ అందాల్సిన అవసరాన్ని ఈ రిపోర్ట్ చెప్తుంది.



