← Back to news

మేళ్లగూడలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన

By Dosawada Adithya· 2h ago· Ranga Reddy
మేళ్లగూడలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన

TG: ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం మేళ్లగూడలో నిర్వహించిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందితే ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి నాయక్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

More in Local