← Back to news

రాజాం ఎమ్మెల్యేతో జనసేన నేతల భేటీ

By Mohan· 1h ago· Rajam, Vizianagaram
రాజాం ఎమ్మెల్యేతో జనసేన నేతల భేటీ

విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌తో జనసేన పార్టీ నేతలు సమావేశమయ్యారు. జనసేన జిల్లా కోఆర్డినేటర్ గురాన అయ్యలు, రాజాం నియోజకవర్గ సమన్వయకర్త నేతల స్రవంతి పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అభ్యున్నతి, కూటమి సమన్వయంపై చర్చించినట్లు తెలిసింది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై ఎమ్మెల్యేతో చర్చించారు. పొగిరీ సురేష్ కుమార్, యూపీ రాజు మరికొందరు పాల్గొన్నారు.

More in Local