పరకాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

TG: పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పరకాలలో జరిగింది. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పరకాల పట్టణంతో పాటు పరకాల, నడికుడా, ఆత్మకూర్, దామెర మండలాల పరిధిలోని అర్హులైన పేద కుటుంబాలకు ఈ కార్డులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.



