← Back to news

విద్యార్థుల జీవితాల్లో గురువుల పాత్ర కీలకం

By A Srisailam· 1h ago· Farooqnagar (Ct), Farooqnagar, Ranga Reddy
విద్యార్థుల జీవితాల్లో గురువుల పాత్ర కీలకం

TG: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని షాద్‌నగర్ మండల విద్యాధికారి టీ. మనోహర్ అన్నారు. తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లోని సాయిరాజా ఫంక్షన్ హాల్‌లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 50 పాఠశాలలకు చెందిన 250 మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

విద్యార్థుల జీవితాల్లో గురువుల పాత్ర కీలకం
విద్యార్థుల జీవితాల్లో గురువుల పాత్ర కీలకం

More in Local