గుత్తి మండలంలో ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు

అనంతపురం జిల్లా గుత్తి మండలంలో 2026 స్థానిక సంస్థల ఎన్నికల కోసం 11 ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అబ్బేదొడ్డి, కరిడికొండ, పెద్దొడ్డి జనరల్ మహిళలకు కేటాయించారు. బసినేపల్లి బీసీ, పి.యర్రగుడి ఎస్టీ, జక్కలచెరువు జనరల్, కొత్తపేట ఎస్సీ, తురకపల్లి బీసీ మహిళ, బేతపల్లి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. ఉబిచెర్ల, సిరిపురం జనరల్ కేటగిరీలో ఉన్నాయి. దీంతో మహిళలకు కేటాయించిన స్థానాలపై ఆసక్తి పెరిగింది



