← Back to news

తమిళనాడు బడ్జెట్ నిరాశపరిచింది: తమిళిసై సౌందరరాజన్

By Mahesh· 5 Aug 2026· Tamilnadu
తమిళనాడు బడ్జెట్ నిరాశపరిచింది: తమిళిసై సౌందరరాజన్

తమిళనాడు 2026-27 బడ్జెట్‌పై బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్ విమర్శలు చేశారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. బడ్జెట్‌లో వాటి అమలుకు తగిన ప్రయారిటీ ఇవ్వలేదన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్‌మెంట్‌కు ఫండ్స్ సరిపోవని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM SHRI పథకాన్ని రాష్ట్రం స్వీకరించాలని సూచించారు. మహిళలకు ఇచ్చే ఇన్సెంటివ్స్ పెంచలేదని, క్యాన్సర్ సేవల అభివృద్ధికి ఇచ్చిన రూ.10 కోట్లు కూడా సరిపోవని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ప్రజలను డిసప్పాయింట్ చేసిందని ఆమె అన్నారు.

More in Politics