డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి అస్వస్థత
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి తీవ్ర జ్వరం వచ్చింది. రాజమండ్రిలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన ఆయన ప్రోగ్రాంని మధ్యలోనే రద్దు చేసుకుని సతీమణితో కలిసి హైదరాబాద్‌కి బయల్దేరారు. జ్వరం తీవ్రం కావడంతో రాజ్‌భవన్‌లో జరిగే ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి కూడా హాజరు కావడం లేదు. ఆయనకు ఇటీవల కుడి భుజానికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే.



