16 లక్షల మంది ఫాలోవర్స్.. ఉన్నట్టుండి ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెకు ఫేస్‌బుక్‌లో దాదాపు 9 లక్షలు, ఇన్‌స్టాలో 7 లక్షలు – మొత్తం 16 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వేరే రాష్ట్రంలో ఉన్న ఓ యువకుడితో మాట్లాడిన ఆమె ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రాశారు. అందులో “ఈ అసంపూర్ణ హృదయాన్ని ఎవరూ నింపలేరు, నేనే నింపుకున్నాను. అందుకు ఇతరులను కాదు, మనల్ని మనమే ప్రేమించుకోవాలి. .” అని ఉంది.

