← Back to news

'విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదగాలి'

By NRPT· 1d ago· Narayanpet
'విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదగాలి'

నారాయణపేట జిల్లా దామరగిద్దలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు ఆయన చిత్రపటాలను పంపిణీ చేశారు. ముదిరాజ్‌లు ఐక్యంగా ముందుకు సాగాలని, పిల్లలకు నాణ్యమైన విద్య అందించి ఉన్నత స్థాయికి చేరేలా ప్రోత్సహించాలని తెలంగాణ రక్షణ సేన నాయకుడు గవినోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. యువత మద్యానికి దూరంగా ఉంటూ సామాజిక, రాజకీయ చైతన్యంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

More in Local