‘మహిళలకు ఫ్రీ బస్’ అంటూ సీఎం గొప్పలు..రియాలిటీ ఇదేనా?
TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ అని చెప్తూ ఓ వ్యక్తి మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బస్సులో 80 మంది ఉంటే అందులో ఇద్దరే మగవాళ్లు ఉన్నారన్నారు. డిపార్ట్‌మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోందని, ఇలా అయితే డబ్బులెలా తేవాలని ప్రశ్నించారు. మహిళల డెవలప్‌మెంట్ కోసం ప్రభుత్వం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. వాళ్ల టికెట్ల డబ్బులు మేమే చెల్లిస్తున్నామని ఈ మధ్య సీఎం రేవంత్ కూడా గొప్పగా చెప్పారు. కానీ డబ్బులు తెమ్మని ఆర్టీసీ వేధిస్తోందని కొందరు ఇలా అంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి?



