7 కేజీల గంజాయి దొరికింది

AP : హుకుంపేట మండలం కొంతిలి జంక్షన్ వద్ద పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని చెక్ చేయగా 7 కేజీల గంజాయి దొరికింది. ఒడిశా రాష్ట్రం మాచ్ఖండ్ మండలం ఏనుగు గ్రామానికి చెందిన అజిత్ సీసాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గరున్న గంజాయి, ఒక స్మార్ట్‌ఫోన్, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న పరశురాం ఖారా, రాముల కోసం పోలీసులు స్పెషల్ టీమ్స్‌తో వెతుకుతున్నారు.



