← Back to news

నందివాడ మండలంలో తాగునీటి సమస్య

By Srikanth· 16 Aug 2026
నందివాడ మండలంలో తాగునీటి సమస్య

AP: కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురంలో కొన్ని నెలలుగా తాగునీటి సమస్యతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. సక్రమంగా తాగునీరు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు మినరల్‌ వాటర్‌ కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అవసరాల కోసం బోరు నీటిని వాడుతున్నా, ఆ నీరు తాగడానికి పనికిరావడం లేదని అంటున్నారు. గ్రామానికి సంబంధించిన తాగునీటి చెరువు గురక, డెక్కతో నిండిపోయి ఉండటంతో నీటి నాణ్యత సరిగా లేదని అంటున్నారు.

More in Local