విజయదశమి.. మంచి గెలుపు సందేశం : MLA

నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం గెలిచిన విజయానికి ఈ పండుగ ప్రతీక అని అన్నారు. ప్రతి ఒక్కరూ చెడును విడనాడి మంచిని ఆచరించాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ప్రేమ, ఐక్యత, సోదరభావం బలపడాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు అన్ని రంగాల్లో విజయం, కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరారు.


