← Back to news

ఊరు దాటితే చీకటే.. వీధి దీపాలెక్కడ?

By Pabbu Bhargavi· 59m ago· Jammikunta, Jammikunta, Karimnagar

కరీంనగర్ జిల్లా జమ్మికుంట వెళ్లే రహదారిపై వీధి దీపాల కొరత తీవ్రంగా ఉంది. హైదరాబాద్ నుంచి ప్రయాణిస్తున్నప్పుడు వునికిచెర్ల గ్రామం దాటిన తర్వాత ఎలకతుర్తి వైపు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వెలుతురు లేదు. గ్రామాల పరిధిలో దీపాలు ఉన్నా, గ్రామాలు దాటిన తర్వాత చీకటి ఆవరిస్తోంది. రాత్రివేళ ద్విచక్ర వాహనదారులు, ఇతర ప్రయాణికులు చీకటిలోనే ప్రయాణించాల్సి వస్తోంది. రహదారిపై గుంతలు, మలుపులు, పశువులు ఎదురైతే ప్రమాదాల ముప్పు ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

More in Local