MPP పదవి మాకే ఇవ్వాలి!

విజయనగరం జిల్లా రేగిడి మండల టీడీపీలో MPP పదవి విషయంలో అసంతృప్తి బయటపడింది. పాలవలస రమణమూర్తికి జడ్పీటీసీ అవకాశం కల్పించనున్నారనే సమాచారంతో ఆయన వర్గీయులు నిరసనకు దిగారు. సోమవారం శ్యాంపురంలోని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ క్యాంపు ఆఫీస్ వద్ద అభ్యర్థుల ఎంపిక సమయంలో తమకు జడ్పీటీసీ కాదు, ఎంపీపీ పదవే కావాలని పట్టుబట్టారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ముందుగా ఎంపీటీసీలుగా గెలవండి, ఆ తర్వాత నిర్ణయిద్దామని చెప్పినట్లు సమాచారం.




