కొత్త వాచ్‌లకు పెరుగుతున్న క్రేజ్!

స్మార్ట్‌ఫోన్లలోనే టైమ్ చూసే రోజుల్లోనూ వాచ్‌లకు డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లో కొత్త వాచ్ బ్రాండ్లు ప్రత్యేక డిజైన్లతో ఆకట్టుకుంటున్నాయి. భారతీయ కళ, సంస్కృతి, చరిత్రతోపాటు పాత నాణేలు, ఆభరణాలను వాచ్‌లలో వాడుతున్నారు. దీంతో వాచ్‌లు టైమ్ చూపించడమే కాకుండా ఫ్యాషన్, వ్యక్తిత్వానికి గుర్తుగా మారుతున్నాయి. కొత్త బ్రాండ్లు దేశీయంగానే కాకుండా విదేశీ మార్కెట్లలోనూ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.



