‘పాలిస్టర్’ అంటే.. Gen Zలో కొత్త అర్థం!

Gen Z సోషల్ మీడియా భాషలో ‘పాలిస్టర్’ అనే కొత్త స్లాంగ్ ట్రెండ్ అవుతోంది. ఇది ఇప్పటివరకు తెలిసిన సింథటిక్ ఫ్యాబ్రిక్ మాత్రమే కాదు.. కృత్రిమం, నకిలీ, ఒరిజినాలిటీ లేనిది అనే అర్థంలోనూ వాడుతున్నారు. ఏదైనా ఆర్టిఫిషియల్‌గా తయారుచేసినట్టుగా, అసహజంగా దాన్ని ‘పాలిస్టర్’ అంటున్నారు. ముఖ్యంగా ఫ్యాషన్, SM కంటెంట్, ట్రెండ్స్‌లో ఈ పదం వినిపిస్తోంది. AI కంటెంట్‌ను కూడా కొందరు ‘పాలిస్టర్’తో పోలుస్తున్నారు. అంటే బయటకు ఆకర్షణీయంగా కనిపించినా.. లోపల మాత్రం కృత్రిమంగా ఉండటం అన్నమాట.



