← Back to news

వెలిగొండ నిర్వాసితులకు భారీ పరిహారం

By DK· 20 Aug 2026· అమరావతి
వెలిగొండ నిర్వాసితులకు భారీ పరిహారం

AP: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భరోసా కల్పించింది. ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో రూ.200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో CM చంద్రబాబు నాయుడు నిర్వాసిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఇప్పటికే జూన్‌ 27న రూ.318 కోట్లు అందించగా, తాజాగా విడుదల చేసిన మొత్తంతో కలిపి ఇప్పటివరకు రూ.518 కోట్ల పరిహారం అందినట్లైంది. మిగిలిన పరిహారాన్ని కూడా త్వరలో అందిస్తామని CM హామీ ఇచ్చారు.

More in AP