← Back to news

మమ్మల్ని నేరస్థుల్లా చూశారు.. మమతా ఆగ్రహం

By Anusha· 1h ago
మమ్మల్ని నేరస్థుల్లా చూశారు.. మమతా ఆగ్రహం

ఢిల్లీలో ప్రొటెస్ట్ వేళ రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ CMలు మమతా బెనర్జీ, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, మాణిక్ సర్కార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు CPI(M) నేతలను కూడా అడ్డుకున్నారు. తమను నేరస్థుల్లా చూశారని మమతా మండిపడ్డారు. ప్రశాంతంగా కూర్చున్నా, పోలీస్ వ్యాన్‌లో ఎక్కించి రెండు గంటల పాటు ఢిల్లీ అంతా తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారని CPI(M) నేతలు విమర్శించారు.

More in National