మస్క్‌కు కమల్ కౌంటర్.. కంగనా ప్రశంసలు!

భారత్‌లో Starlink ఇంటర్నెట్ సర్వీసెస్‌కు పర్మిషన్స్ ఆలస్యమవుతున్నాయంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందించారు. ఏ బిలియనీర్ కూడా దేశ విధానాలను శాసించలేరని స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాలకూ తక్కువ ధరకు ఇంటర్నెట్ అందాలని, దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదని అన్నారు. భారత్ తన నిర్ణయాలు తానే తీసుకుంటుందని తెలిపారు. కమల్ పోస్ట్‌ను షేర్ చేసిన ఎంపీ కంగనా రనౌత్.. మస్క్‌కు ఆయన గట్టిగా, స్పష్టంగా బదులిచ్చారంటూ ప్రశంసించారు.



