MVSR కాలేజీలో ప్రమాదం.. 12 మందికి గాయాలు
TG: హైదరాబాద్ నాదర్‌గుల్‌లోని MVSR ఇంజినీరింగ్ కాలేజీలో డాండియా ప్రోగ్రామ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. ‘సంగమం–2026’ ఫెస్ట్‌లో లైటింగ్ సిస్టమ్ జనాలపై కూలిపోయింది. ఈ ఘటనలో 12 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే కాలేజీ సిబ్బంది, తోటి విద్యార్థులు ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి మరియు సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ప్రమాదానికి కారణమేంటో పోలీసులు తెలుసుకుంటున్నారు.


