ఆరుట్లలో బడి నిర్మాణం అలా జరిగింది: పద్మజా షా
TG: TPF ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో <a href="https://www.theclearcutnews.com/n/TjbqUjW">రౌండ్ టేబుల్</a> నిర్వహించారు. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ ఆరుట్లలో నిర్మించిన బడి గురించి వివరించారు. స్కూల్ బాగుందని అందరూ అంటున్నారని, అయితే ఆ నిర్మాణానికి తాము ఫాలో అయిన విధానాల గురించి తప్పక తెలుసుకోవాలని చెప్పారు. హెడ్మాస్టర్ పర్యవేక్షణలో తల్లిదండ్రుల కమిటీ వేసి, మొత్తం 12 కోట్ల రూపాయలు వాళ్ల ద్వారానే ఖర్చు చేయించామన్నారు. దీని వల్ల మెరుగైన నాణ్యత సాధ్యమైందన్నారు.

