దేశంలోని బడ్జెట్ స్కూళ్లలో నెంబర్ 1గా అభ్యాస విద్యాలయం

AP: విజయవాడలోని అభ్యాస విద్యాలయం(Abhyasa Vidyalayam) సీఫోర్ స్కూల్ ర్యాంకింగ్స్ 2026లో భారతదేశంలోని ఉత్తమ బడ్జెట్ స్కూళ్ల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్‌లో అభ్యాస విద్యాలయం 949 స్కోర్ సాధించింది. నాణ్యమైన చదువును అందరికీ అందుబాటులో ఉంచేలా ఈ పాఠశాల కృషి చేస్తోంది. పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠాలు చెప్పడంతోపాటు అర్థవంతమైన చదువును వాళ్లకు అందించడం ఈ స్కూల్ విధానం. ఈ విజయానికి కారణం టీచర్స్, స్టూడెంట్స్, వాళ్ల తల్లిదండ్రులు అని స్కూల్ యాజమాన్యం తెలిపింది.





