భూముల కోసం సుప్రీంకు 2,500 మంది..

‘మా భూములు మావే.. మా బతుకుదెరువును కాపాడండి’ అంటూ 2,500 మంది గిరిజనులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గిరిజన ప్రాంతాల్లో ల్యాండ్ రైట్స్ ఆక్ట్స్‌ను కాపాడాలని కోరుతూ పిటిషన్ ఫైల్ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 1,100 మంది, తెలంగాణ నుంచి 1,400 మంది ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఉన్నారు. తమ భూములను రక్షించాలని, గిరిజనుల హక్కులను కాపాడాలని వారు కోరారు. ఈ పిటిషన్‌లో 500 మంది గిరిజన మహిళలు, 500 మంది యూనివర్సిటీ విద్యార్దులు పోరాటంలో బాగం అయ్యారు.


