← Back to news

MP అవినాశ్ రెడ్డి ఇంట్లో ED సోదాలు.. ఒకేసారి రెండు చోట్ల!

By Mahesh· 21 Aug 2026· AP

AP: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆఫీసర్స్ కడప MP YS అవినాశ్ రెడ్డికి సంబంధించిన ఇళ్లల్లో రైడ్స్ చేశారు. హైదరాబాద్‌లోని రెండు ప్రాంతాలు, పులివెందులలో నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి YS భాస్కర్ రెడ్డికి సంబంధించిన ప్రదేశాల్లోనూ రైడ్స్ జరుగుతున్నాయి. YS వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు కింద ఈ సోదాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా ED అధికారులు రైడ్స్ చేయడంతో తెలుగు రాష్టాల్లో సంచలనంగా మారింది.

More in AP