← Back to news

మంగళగిరిలో మోడల్ రైతు బజార్

By rajaratnam· 26 Aug 2026· మంగళగిరి
మంగళగిరిలో మోడల్ రైతు బజార్

AP : మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఒక సూపర్ మోడల్ రైతు బజార్‌ రాబోతోంది. ఇందులో రైతులు తమ కూరగాయలు, పండ్లను డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు. ఈ మార్కెట్‌లో 102 కూరగాయల స్టాళ్లు, 54 పండ్లు-పూల స్టాళ్లతో పాటు హోల్‌సేల్ షాపులు, కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు మంచి ఇన్కమ్, నిల్వ చేసుకునే ఛాన్స్ దక్కుతాయి. ఆగష్టు 27న ఈ మోడల్ మార్కెట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.

More in Local