ఒక్క పుల్‌అప్ రాని స్థాయి నుంచి ఆసియా నంబర్-1గా

ప్రభ్లీన్ కౌర్ గిల్ ఆసియాలో నంబర్-1 స్ట్రీట్ లిఫ్టర్‌గా నిలిచారు. 18 ఏళ్ల వయసులో ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మందుకు అలవాటుపడ్డ ఆమె ఓ ఘటన తర్వాత జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వ్యాయామం మొదలుపెట్టి కాలిస్టెనిక్స్‌లో శిక్షణ తీసుకున్నారు. మొదట ఒక్క పుల్‌అప్ చేయలేకపోయినా.. 6 నెలల్లో 10 పుల్‌అప్స్ చేసే స్థాయికి చేరుకున్నారు. సింగపూర్ ఓపెన్ గెలిచి ఆసియా నంబర్-1 ర్యాంక్ సాధించారు. 13.75 కిలోల మసిల్‌అప్‌తో జాతీయ రికార్డు సాధించారు.



