🧠 పిల్లల స్ట్రెస్‌కు అసలు కారణం ఎగ్జామ్స్ కాదట!

"పిల్లలకు స్ట్రెస్ అంటే ఎగ్జామ్సే కారణం" అనుకుంటున్నారా? కొత్త స్టడీ మాత్రం వేరే విషయం చెబుతోంది. బెంగళూరులో వేలాది కౌన్సెలింగ్ సెషన్ల ఆధారంగా చేసిన ఈ స్టడీలో, పరీక్షల కంటే ఇంట్లోని గొడవల వల్లే ఎక్కువ మంది విద్యార్థులు సహాయం కోరినట్టు తేలింది. Anxiety ఇప్పటికీ టాప్‌లో ఉండగా, 16–18 ఏళ్ల విద్యార్థుల్లో సెల్ఫ్-హార్మ్ ఆలోచనలు కూడా ఎక్కువగా కనిపించాయి. సింపుల్‌గా చెప్పాలంటే... పిల్లల స్ట్రెస్‌కు ఎగ్జామ్స్ మాత్రమే కాదు, ఇంట్లో జరిగే విషయాలు కూడా కారణమవుతున్నాయి.



