విద్యుత్ క్లియరెన్స్‌కు కొత్త రూల్!

తెలంగాణలో డేటా సెంటర్లకు పవర్ సప్లై విషయంలో ట్రాన్స్‌కో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారీ విద్యుత్ లోడ్లకు బల్క్ లోడ్ అస్యూరెన్స్ కమిటీ చెక్ చేసిన తర్వాతే సమ్మతి లేఖలు ఇవ్వాలని ఆదేశించింది. మహేశ్వరం, చందనవెల్లి ప్రాంతాల్లో కొత్త విద్యుత్ వ్యవస్థల నిర్మాణానికి ఐదేళ్లు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే 6,200 MVA విద్యుత్ డిమాండ్‌కు హామీ లేఖలు ఇచ్చారు. విద్యుత్ వ్యవస్థపై పూర్తి అధ్యయనం అయ్యే వరకు నిర్మాణ పనులు ప్రారంభించకూడదని స్పష్టం చేసింది.



