పిల్లలు గేమ్స్ ఆడే కంట్రోలర్‌తో లేజర్ ఆయుధాలు

హార్ముజ్ జలసంధిలో డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్‌ను అడ్డుకునేందుకు అమెరికా హై-ఎనర్జీ లేజర్ వెపన్స్‌ను మోహరిస్తోంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వీటిని ఆపరేట్ చేసేందుకు సైనికులు పిల్లలు గేమ్స్ ఆడే ఎక్స్‌బాక్స్ కంట్రోలర్లను ఉపయోగిస్తున్నారు. వీటిని మిలిటరీ అవసరాలకు తగ్గట్టు మార్చారు. ఖరీదైన మిసైల్స్‌తో పోలిస్తే లేజర్ ఆయుధాలతో డ్రోన్లు, మిసైల్స్‌ను తక్కువ ఖర్చుతో అడ్డుకోవచ్చని అమెరికా భావిస్తోంది.



